: బోరు బావిలో గ్యాస్ మంటలు... భయాందోళనలో ఉప్పలగుప్తం ప్రజలు
తూర్పు గోదావరి జిల్లాలో మరో గ్యాస్ బావిలో మంటలు చెలరేగాయి. జిల్లాల్లోని ఉప్పలగుప్తం మండలం ఎస్. కొత్తపల్లిలోని ఓ బోరు బావిలో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. గతంలో ఇదే జిల్లాలోని పాశర్లపూడిలో గ్యాస్ బావిలో మంటలు చెలరేగి రోజుల తరబడి అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. సదరు మంటలను అదుపు చేసేందుకు అమెరికా నుంని నిపుణులను రప్పించాల్సి వచ్చింది. నాటి ఘటనను గుర్తు చేసుకున్న కొత్తపల్లి వాసులు ప్రమాదంపై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం చేరవేశారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.