: కండలేరు ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు శంకుస్థాపన


నెల్లూరు జిల్లా పొదలకూరులో కండలేరు ఎడమ కాలువ ఎత్తిపోతల పథకానికి ఏపీ సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రూ.61 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడుతూ, జలవనరులను సమర్థంగా వినియోగించుకునేందుకే నీరు-చెట్టు పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కృష్ణా, పెన్నా నదుల అనుసంధానంతో కరవు ఉండదని అన్నారు. జనవరి నెలలో రూ.4,300 కోట్ల రుణాలను మాఫీ చేస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు.

  • Loading...

More Telugu News