: త్వరలోనే ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్: కేటీఆర్
హైదరాబాద్ నగరం త్వరలోనే ప్రపంచస్థాయి నగరంగా అవతరించనుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆ స్థాయికి చేరుకోవడానికి అవసరమైన అన్ని వనరులు హైదరాబాదుకు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. ఈ రోజు మాదాపూర్ లో కృష్ణా జలాల తరలింపు 3వ దశ పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైటెక్ సిటీ పరిధిలో పైప్ లైన్ విస్తరణకు రూ. 25 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. అంతేకాకుండా, ఐటీ కారిడార్ లోని రోడ్లను రూ. 16 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ ప్రత్యేక అధికారి సోమేష్ కుమార్, జలమండలి ఎండీ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.