: గుంటూరు జిల్లా నేతలతో జగన్ సమావేశం... రాజధాని ప్రాంతంలో భూసేకరణ నోటీస్ పై చర్చ
గుంటూరు జిల్లా వైసీపీ నేతలతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ లో సమావేశమయ్యారు. పార్టీ ముఖ్య నేతలు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు కూడా పాల్గొన్నారు. ఏపీ రాజధాని ప్రాంతంలో భూసేకరణ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుండడంతో భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నారు. రాజధాని ప్రాంత రైతుల భూములు కాపాడేందుకు మునుముందు ఎలా పోరాడాలన్న అంశాలపై నేతలతో చర్చిస్తున్నారు. భూసేకరణ వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు నష్టం జరగకుండా చూడాలని, అందుకోసం ఎంతవరకైనా పోరాటం చేయాలని పార్టీ నేతలతో జగన్ అన్నట్టు తెలిసింది. ఈ క్రమంలో రైతులకు అండగా ఉండేలా భరోసా ఇవ్వాలన్నారు.