: మరో రెండు కొత్త మార్గాలకు ఎయిర్ ఏషియా సర్వీసులు


విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా మరో రెండు కొత్త మార్గాల్లో తాజాగా విమాన సర్వీసులు ప్రారంభించింది. న్యూఢిల్లీ-విశాఖపట్నం, న్యూఢిల్లీ-గౌహతి మార్గాల్లో సర్వీసులు నడుపుతోంది. ఈ రెండు మార్గాల్లోనూ సంస్థ ప్రమోషనల్ ఆఫర్లను కూడా ప్రకటించింది. న్యూఢిల్లీ-విశాఖ మార్గంలో టికెట్ ధర రూ.3,490గా నిర్ణయించామని, నవంబర్ ఒకటవ తేదీలోగా టికెట్లు బుక్ చేసుకోవాలని ఎయిర్ ఏషియా తెలిపింది. ఆ టికెట్ తో నవంబర్ 20 నుంచి వచ్చే ఏడాది అక్టోబర్ 29 వరకు ప్రయాణాలు చేయవచ్చని వెల్లడించింది. ఇక దీపావళి పండుగ సందర్భంగా కౌలాలంపూర్ నుంచి విశాఖ, గోవా, హాంకాంగ్, మిరి నగరాలకు రూ.850 టికెట్ నుంచి మరో ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ తో వచ్చే ఏడాది ఫిబ్రవరి 29 వరకు ప్రయాణాలు చేయవచ్చని తెలిపింది.

  • Loading...

More Telugu News