: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై తీవ్ర విమర్శలు చేసిన టీఆర్ఎస్ ఎంపీ
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ వాడినని చెప్పుకుంటూనే, చంద్రబాబు పంచన చేరి కేసీఆర్ పై అడ్డమైన వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. "తిన్నా, పన్నా, లేచినా కేసీఆర్ మీదే రాస్తుంటాడు. కేసీఆర్ ఇమేజ్ డ్యామేజ్ చేయడమే ఆయన లక్ష్యం" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రజ్యోతి వార్తలను ఎవరూ నమ్మరాదని, తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ కు అండగా ఉండాలని అన్నారు. తెలంగాణ బాగుపడుతుంటే చూడలేని వ్యక్తి రాధాకృష్ణ అని ఆరోపించారు. కరీంనగర్ జిల్లా వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లిలో ఆదర్శ పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.