: అమరావతిలో రేపు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యటన
ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బోసలే రేపు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరు న్యాయమూర్తులు కూడా రానున్నారు. రాజధాని అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన న్యాయనగరం ప్రాంతాన్ని వారు పరిశీలిస్తారు. ఈ మేరకు రేపు హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం చేరుకుని అక్కడినుంచి అమరావతికి వస్తారు. ముందుగా న్యాయనగర ప్రాంతాన్ని పరిశీలిస్తారు. సాయంత్రం సీఆర్ డీఏ అధికారులతో న్యాయమూర్తులు సమావేశమవుతారని తెలిసింది.