: తూర్పుగోదావరి జిల్లా దిండిలో 144 సెక్షన్
తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం దిండిలో 144 సెక్షన్ విధించారు. గెయిల్ గ్యాస్ పైపు లైన్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. సుమారు 200 మంది పోలీసుల రక్షణలో పైప్ లైన్ పనులు జరుగుతున్నాయి. గత ఏడాది నగరం గ్రామంలో గ్యాస్ పైప్ లైన్ పేలి పలువురు దుర్మరణం పాలయ్యారు. ఆ తర్వాత గ్యాస్ సరఫరాలో ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో, గ్యాస్ పైప్ లైనును తిరిగి నిర్మించాలని కేంద్రం ఆదేశించింది. అయితే నగరం పేలుడు నేపథ్యంలో, పైప్ లైన్ నిర్మాణానికి దిండి రైతులు అభ్యంతరం తెలిపారు. దీంతో, గత ఐదు నెలలుగా పనులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో, కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పోలీసుల సహకారంతో పైప్ లైన్ నిర్మాణం పనులను చేపట్టారు.