: వరంగల్ అభ్యర్థి విషయంలో కేసీఆర్ ను మంత్రులు తప్పుదోవ పట్టిస్తున్నారు: వంగపల్లి శ్రీనివాస్


వరంగల్ లోక్ సభ అభ్యర్థి విషయంలో గుడిమళ్ల రవికుమార్ వైపే టీఆర్ఎస్ మొగ్గు చూపుతోందంటూ వస్తున్న వార్తలపై తెలంగాణ మాదిగ దండోరా నేత వంగపల్లి శ్రీనివాస్ మండిపడుతున్నారు. అతను మాదిగ కులస్థుడు కాదని, అసలైన మాదిగలకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రవికుమార్ దళితుడు కాదన్న విషయాన్ని బహిర్గతం చేస్తామని చెప్పారు. అసలు అభ్యర్థి విషయంలో సీఎం కేసీఆర్ ను మంత్రులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అభ్యర్థి ఎంపికపై సీఎం పునరాలోచన చేయాలని వంగపల్లి కోరారు. ఇవాళ వేయిస్తంభాల గుడి దగ్గర మాదిగ దండోరా సభ నిర్వహిస్తున్నామన్నారు.

  • Loading...

More Telugu News