: సీఎం తర్వాత బాధ్యత నాదే... ఏపీ మంత్రి నారాయణ వ్యాఖ్య


ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ నిన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో నారాయణ ఇప్పటికే కీలకంగా వ్యవహరిస్తున్నారు. భూసేకరణ దగ్గర నుంచి రాజధాని కాంట్రాక్టర్ ను నిర్ణయించడం, మాస్టర్ ప్లాన్ తదితరాల్లో నారాయణదే కీలక భూమిక. ఈ విషయంలో సీఎం నారా చంద్రబాబునాయుడు తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నా, నారాయణ మాత్రం రాజధాని నిర్మాణం మొత్తం బాధ్యత తనదే అన్నట్లుగా అహరహం శ్రమిస్తున్నారు. నిన్న తన సొంత జిల్లా నెల్లూరులో మీడియాతో మాట్లాడిన సందర్భంగా నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణం విషయంలో సీఎం తర్వాత బాధ్యత మొత్తం తనదేనని ఆయన చెప్పారు. సీఆర్డీఏలో తనదే హవా అంటూ కొందరు చేస్తున్న విమర్శలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎవరెన్ని విమర్శలు చేసినా, రాజధాని అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని కూడా నారాయణ ప్రకటించారు.

  • Loading...

More Telugu News