: అవార్డులు వెనక్కి ఇచ్చేయడంపై జైట్లీ మండిపాటు
బీజేపీ అధికారం చేపట్టిన తరువాత చోటుచేసుకున్న ఘటనలపై నిరసన వ్యక్తం చేస్తూ పలువురు సాహిత్య వేత్తలు తమ ప్రతిభకు గుర్తింపుగా లభించిన ప్రభుత్వ పురస్కారాలను వెనక్కి ఇవ్వడంపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తీవ్రంగా స్పందించారు. పాట్నాలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పురస్కారాలు ఇచ్చేస్తున్న వారంతా బీజేపీ వ్యతిరేకులని ముద్ర వేసేశారు. వారిలో కొందరు లోక్ సభ ఎన్నికల ముందు వారణాసిలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారని ఆయన పేర్కొన్నారు. మతవిద్వేషాలు పెరిగిపోతున్నాయని సాహితీవేత్తలు చేస్తున్న ఆరోపణలు సరైనవి కాదని ఆయన అన్నారు. కాగా, ప్రముఖ శాస్త్రవేత్త భార్గవ తన పద్మభూషణ్ అవార్డును తిరిగి ఇచ్చేస్తున్నట్టు తెలిపారు.