: స్పైస్ జెట్ సీఈవో రాజీనామా
స్పైస్ జెట్ సీఈవో సంజీవ్ కపూర్ తన పదవికి రాజీనామా చేశారు. గతంలో జీఎంజీ ఎయిర్ లైన్ ఆఫ్ బంగ్లాదేశ్ కు సీఈవోగా వ్యవహరించిన సంజీవ్ కపూర్... స్పైస్ జెట్ సహవ్యవస్థాపకుడు అజయ్ సింగ్ పునరాగమనం తరువాత తన పదవికి రాజీనామా చేశారు. అజయ్ రాకతో మేనేజ్ మెంట్ స్థాయి వ్యక్తి రాజీనామా చేయడం ఆసక్తి రేపుతోంది. కాగా, సంజీవ్ కపూర్ మరో విమానయాన సంస్థలో చేరుతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈయన నేతృత్వంలో వినూత్నమైన ఆఫర్లతో స్పైస్ జెట్ వినియోగదారులకు దగ్గరైన సంగతి తెలిసిందే.