: పాక్ క్రికెట్ బోర్డుకు క్షమాపణ చెప్పిన బీసీసీఐ
పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ క్షమాపణలు తెలిపింది. ముంబైలోని బీసీసీఐ కార్యాలయాన్ని శివసేన కార్యకర్తలు ముట్టడించడంతో ఈ నెల 19వ తేదీన రెండు బోర్డుల మధ్య జరగాల్సిన సమావేశం జరగలేదు. దీంతో, ఇండియా-పాక్ ల మధ్య జరగాల్సిన సిరీస్ పై స్పష్టత రాలేదు. దీంతో, భారత్ లో 2016లో జరగనున్న టీ20 ప్రపంచకప్ ను బహిష్కరించాలని పాక్ ఆటగాళ్లు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే శివసేన నిరసనలతో ముంబైలో జరగాల్సిన భేటీ రద్దుకు సంబంధించి పాక్ బోర్డుకు బీసీసీఐ క్షమాపణలు తెలిపింది.