: గుండు సుధారాణిని సస్పెండ్ చేసిన టీడీపీ


తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీ గుండు సుధారాణి సస్పెన్షన్ కు గురయ్యారు. సుధారాణి టీఆర్ఎస్ లో చేరుతున్నారనే వార్తలు గత కొద్ది రోజులుగా హల్ చల్ చేస్తున్నాయి. దీనికి తోడు, ఢిల్లీలో నిన్న మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆమె భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ పాలన అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చారు. దీంతో, ఆమెపై టీడీపీ నాయకత్వం సీరియస్ అయింది. క్రమశిక్షణా చర్యల కింద ఆమెపై చర్యలు తీసుకుంటూ, పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

  • Loading...

More Telugu News