: 'అఖిలేష్ చేతకాని సీఎం' అంటూ సొంత పార్టీ ఎమ్మెల్సీ ఆగ్రహం


ఒకేసారి 8 మంది మంత్రి వర్గ సహచరులను తొలగించి, సంచలన నిర్ణయం తీసుకున్న అఖిలేష్ యాదవ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రులపై సాధారణంగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటాయి. కానీ అఖిలేష్ పై సొంతపార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్సీ దేవేంద్ర ప్రతాప్ సింగ్ లక్నోలో మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్ చరిత్రలో అత్యంత బలహీనుడైన, చేతకాని ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ నిలిచారని అన్నారు. ఈ విషయంలో పార్టీ అధినేత ములాయం ఆలోచించాలని ఆయన తెలిపారు. అఖిలేష్ ను తీసేసి వేరే అనుభవజ్ఞుడని ముఖ్యమంత్రిని చేయని పక్షంలో పార్టీకి ఇబ్బందులు తప్పవని ఆయన పేర్కొన్నారు. నాలుగేళ్లుగా అఖిలేష్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయనను ప్రజలు గుర్తించడం లేదని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News