: మూడు రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన...వరంగల్ ఎన్నికపై దిగ్విజయ్


వరంగల్ లోక్ సభ ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి పేరును రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల పరిశీలకుడు దిగ్విజయ్ సింగ్ తెలిపారు. అభ్యర్థి ఎంపిక కోసం పార్టీ నేతల అభిప్రాయాలను స్వీకరిస్తున్నట్టు ఆయన చెప్పారు. అభ్యర్థి ఎంపిక కోసం ఇవాళ హైదరాబాద్ వచ్చిన దిగ్విజయ్ గాంధీభవన్ లో పార్టీ నేతలతో చర్చించారు. ఇదే సమయంలో వివేక్ సోదరులు కూడా పాల్గొన్నారు. వరంగల్ నుంచి వివేక్ ను బరిలోకి దింపాలని హస్తం పార్టీ భావిస్తోంది. అయితే ఆ సీటు తనకు వద్దని సర్వే సత్యనారాయణకు ఇమ్మని వివేక్ చెప్పినట్టు వార్తలు వచ్చాయి.

  • Loading...

More Telugu News