: అశ్లీల ఫోటోలు తీసి బెదిరిస్తూ, డబ్బు కాజేసిన తమిళ నటి అరెస్ట్
ఆ యువతి చెన్నైలోని ఉత్తాండి ప్రాంతంలో నివసిస్తున్న ఓ వర్థమాన నటి. తమిళ చిత్రాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. ఓ టాక్సీ డ్రైవర్ తో ఉన్న అశ్లీల ఫోటోలు తీసి వాటిని బయట పెడతానని బెదిరిస్తూ, అతని నుంచి డబ్బు కాజేసిన కేసులో అరెస్టయింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, తూత్తుకుడికి చెందిన రామ్ జయం అనే వ్యక్తి పూరూర్ మాంబాక్కంలో ఉంటున్నాడు. సదరు నటి తనను బెదిరించి డబ్బు కాజేసిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారణ జరిపారు. మరో వ్యక్తితో కలసి తనను ఆమె మోసం చేసిందని ఆయనిచ్చిన ఫిర్యాదు మేరకు ఆ నటిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంలో ఆమె వాదన మరోలా ఉంది. తనకు రామ్ జయంతో పరిచయం ఉన్నమాట వాస్తవమేనని, తనకు అమ్మాయిలు కావాలని వేధిస్తుంటే, బుద్ధి చెప్పాలనే, బంధించి అశ్లీల ఫోటోలు తీశానని, అతని నుంచి కేవలం రూ. 2 వేలే తీసుకున్నానని చెప్పింది. విషయం అర్థం చేసుకున్న పోలీసులు ఆమెతో పాటు ఆమెకు సాయపడిన వ్యక్తిపై కేసు పెట్టి జైలుకు తరలించారు.