: తాప్సీ కామెంట్ కి నవ్వేసిన రానా!
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రానా దగ్గుబాటికి ఓ ఆసక్తికర సన్నివేశం ఎదురైంది. దీనిని ట్విట్టర్లో అభిమానులకు తెలిపాడు. దానిపై నటి తాప్సీ స్పందించి ఆటపట్టించింది. దీనికి రానా నవ్వేశాడు. వీరి సంభాషణ సోషల్ మీడియాలోని వారి అభిమానులను ఆకట్టుకుంటోొంది. అసలు విషయం ఏమిటంటే, రానా చెన్నై నుంచి గోవాకు ఎయిరిండియాలో టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే పొరపాటున ఎయిర్ ఇండియా ఒకే సీటును ఇద్దరికి కేటాయించింది. ఈ పొరపాటును రానా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చెప్పాడు. దీనిపై స్పందించిన నటి తాప్సీ 'మొత్తానికి మంచి ఛాన్స్ కొట్టేశావన్నమాట, ఇలా ఒకరి ఒళ్లో ఒకరు కూర్చునే అవకాశం కలిగింది' అంటూ ఆటపట్టించింది. దానికి రానా 'హహహా...' అంటూ పోస్ట్ పెట్టాడు. ఈ సంభాషణ అభిమానులను ఆకట్టుకుంటోంది.