: ఇండియాలో లక్ష వోక్సవ్యాగన్ కార్లలో లోపాలు!
భారత్ లో సుమారు లక్ష వోక్స్ వ్యాగన్ కార్లలో లోపాలు ఉండటంతో వాటిని రీకాల్ చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఒక టెలివిజన్ ఛానల్ లో ఈ వార్తలు ప్రసారమయ్యాయి. వచ్చే నెల నవంబర్ 8వ తేదీ లోగా ఈ కార్లను రీకాల్ చేయనున్నట్లు తెలుస్తోంది. దిగుమతి చేసుకున్న ఇంజన్లను వోక్స్ వ్యాగన్ కార్లలో ఫిట్ చేశారు. అయితే ఈ ఇంజన్లలో లోపాలు తలెత్తాయి. వాటిలో సుమారు 20,000 డీజిల్ వెహికల్స్ వరకు ఉన్నాయి. దీని ప్రభావం భారత మార్కెట్ లోని వెంటో, జెట్టా, సెడాన్, పోలో హ్యాచ్ బ్యాక్, పోలో క్రాస్ ఓవర్ కార్లపై పడే అవకాశం ఉంది. ఈ సందర్భంగా వోక్స్ వ్యాగన్ ఇండియా అధికార ప్రతినిధి మాట్లాడుతూ, ఈ విషయమై కంపెనీ విచారణ కొనసాగుతోందని, కార్ల రీకాల్ కు సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు.