: నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తా... లేకపోతే సాక్షి పత్రికను మూసేస్తారా?: ఏపీ మంత్రి నారాయణ
సాక్షి దినపత్రికపై ఏపీ మంత్రి నారాయణ మండిపడ్డారు. ఎప్పుడూ ఏదో ఒక వార్తను సృష్టించి తమపై బురదజల్లడమే సాక్షి పని అంటూ విమర్శించారు. తాను వెళ్లి కాంట్రాక్టర్లను కలిసినట్టు సాక్షి వార్తలు ప్రచురించిందని... వాస్తవానికి తాను ఇంతవరకు ఒక్క కాంట్రాక్టర్ ను కూడా కలవలేదని ఆయన అన్నారు. ఒకవేళ కలిసినట్టు సాక్షి పత్రిక సరైన ఆధారాలు చూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని... లేకపోతే సాక్షి పత్రికను మూసేస్తారా? అని ఆయన ప్రశ్నించారు.