: బ్రిటన్ టూర్ లో క్వీన్ ఎలిజబెత్ తో మోదీ విందు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నవంబర్ లో బ్రిటన్ లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో 13వ తేదీన క్వీన్ ఎలిజబెత్ తో ప్రధాని సమావేశమవుతారు. అనంతరం బకింగ్ హామ్ ప్యాలెస్ లో ఆమెతో మోదీ విందు చేయనున్నారని తెలిసింది. వచ్చేనెల 12న మోదీ లండన్ కు వెళ్లనున్నారు. అదే రోజు బ్రిటిష్ పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగించనున్నారు. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ తో సమావేశం అవుతారు. ఆ తరువాత రోజున రాని ఎలిజబెత్ తో లంచ్ కు ప్రణాళిక సిద్ధమైనట్లు సమాచారం.