: అభీష్ట నియామకం వెనక మర్మమేంటి?: చంద్రబాబును ప్రశ్నించిన రఘువీరా


ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా ఎస్.అభీష్టను ఎందుకు నియమించారని కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి ప్రశ్నించారు. సీఎం కార్యాలయంలో రాజ్యాంగేతర శక్తులు విధుల్లో ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ మధ్యాహ్నం హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని నిప్పులు చెరిగారు. అన్ని ప్రధానమైన దస్త్రాలూ లోకేశ్ సన్నిహితుడైన అభీష్ట ద్వారానే కదులుతున్నాయని రఘువీరా ఆరోపించారు. అన్ని నిర్ణయాలూ వీరి కనుసన్నల్లోనే జరుగుతున్నాయని, అసలు అభీష్టకు ఉన్న అర్హతలేంటని ప్రశ్నించారు. ఆయన నియామకం వెనకున్న అసలు విషయాన్ని చంద్రబాబు వెల్లడించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News