: కేసీఆర్ పై సమగ్ర విచారణ జరిపించాలి... ఆయనపై మోదీకి ఫిర్యాదు చేస్తాం: సురవరం


కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు జరిపిన కేటాయింపులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇప్పుడు ఇబ్బందికరంగా మారాయి. ఓవైపు సీబీఐ ఈ అంశంపై లోతుగా దర్యాప్తు జరుపుతుంటే... మరోవైపు అసలు ఏం జరిగిందో పూర్తి స్థాయిలో నివేదిక అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించింది. ఈ క్రమంలో, ఈ అంశంపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ కేటాయింపులపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. వామపక్షాల ఎంపీలతో కలసి దీనిపై తాము ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ వ్యవహరించిన తీరు అత్యంత అభ్యంతరకరంగా ఉందని విమర్శించారు.

  • Loading...

More Telugu News