: సొంత ఖర్చుతోనే కేసీఆర్ యాగం నిర్వహించుకోవాలి: సురవరం సుధాకరరెడ్డి
తెలంగాణ సీఎం కేసీఆర్ చండీయాగంపై పలువురు నేతలు స్పందిస్తున్నారు. సీఎం తన సొంత ఖర్చుతో యాగాన్ని చేసుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి అన్నారు. ప్రభుత్వ ఖర్చుతో యాగం నిర్వహిస్తే తాము అంగీకరించలేమన్నారు. విశ్వాసాలు అనేవి వ్యక్తిగత విషయాలని, అలాంటివాటికి ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టకూడదని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో సురవరం గో సంరక్షణ గురించి ప్రస్తావించారు. తమ పార్టీ గో సంరక్షణకు వ్యతిరేకం కాదన్నారు. ప్రధాని మోదీ 'త్రి ఇడియట్స్' అని వ్యాఖ్యానించడం ఆయన స్థాయికి తగ్గట్టు లేదన్నారు. వెంకయ్యనాయుడుకు మంత్రి పదవి రాగానే మోదీ ఆయన కళ్ళకు దేవదూతలా కనిపిస్తున్నారని చురకంటించారు. వరంగల్ ఉపఎన్నికల్లో వామపక్షాల అభ్యర్థినే ప్రజలు గెలిపిస్తారని ఆశిస్తున్నట్టు సురవరం ఆశాభావం వ్యక్తం చేశారు.