: తలసానికి మంత్రి పదవిపై హైకోర్టులో పిటిషన్... రెండు వారాల తర్వాత విచారణ
టీడీపీ టికెట్ పై ఎమ్మెల్యేగా విజయం సాధించి టీఆర్ఎస్ సర్కారులో లో మంత్రిగా కొనసాగుతున్న తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ను ఇప్పుడప్పుడే వివాదాలు వీడేలా లేవు. తలసానిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని టీ టీడీపీ నేతలు ఇటు అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారితో పాటు, అటు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కు కూడా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తలసానిపై టీ టీడీపీ సహా వామపక్షాలు కూడా పరుష పదజాలంతో విమర్శలు గుప్పిస్తున్నాయి. వీటికి తలసాని కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తలసానికి మంత్రి పదవిపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.