: విశాఖ జిల్లాలో పోలీసులపై తేనెటీగల దాడి... 18 మందికి గాయాలు


విశాఖ జిల్లా చింతపల్లి మండలం కోరుకొండ అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న స్పెషల్ పార్టీ పోలీసులపై తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. తేనెటీగల దాడిలో 18 మంది స్పెషల్ పార్టీ పోలీసులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని చింతపల్లి ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. ఈ దాడి కారణంగా పోలీసులు కూంబింగ్ నిలిపివేశారు.

  • Loading...

More Telugu News