: సోషల్ మీడియాకెక్కిన బీజేపీ, టీడీపీ వివాదం...సంయమనం పాటిద్దామంటున్న నారా లోకేశ్


ఏపీలో అధికార టీడీపీ, దాని మిత్రపక్షం బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు సర్కారుపై విరుచుకుపడుతున్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై నిన్న టీడీపీ ఎమ్మెల్సీ వీబీ రాజేంద్రప్రసాద్ ఒంటికాలిపై లేచారు. సోము వీర్రాజు మిత్ర ధర్మాన్ని మరచి మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే, టీడీపీకి వ్యతిరేకంగా బీజేపీ నేతలు సోషల్ మీడియాలో పలు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారట. దీనిపై తీవ్ర మనస్తాపానికి గురైన కొంతమంది నేతలు విషయాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో కాస్తంత సంయమనంతో వ్యవహరిద్దామని లోకేశ్ తన పార్టీ కార్యకర్తలకు సర్దిచెప్పారని విశ్వసనీయ సమాచారం.

  • Loading...

More Telugu News