: ట్విట్టర్ లో కనిపించని పవన్ కల్యాణ్


పలు అంశాలపై, ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో భూములను ఇచ్చేందుకు అంగీకరించని రైతులకు అనుకూలంగా పలు సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో కనిపించక సరిగ్గా రెండు నెలలైంది. ఆగస్టు 28న ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆయన రెండు నెలలు దాటినా మరో వ్యాఖ్యను పోస్ట్ చేయలేదు. అప్పట్లో భూ సేకరణ తప్ప సమీకరణ జోలికి పోబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటిస్తే, "రైతుల మనోభావాలను పరిశీలించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు..." అని ట్వీట్ చేసిన ఆయన, ఇప్పుడు భూసేకరణ తప్పదని ఏపీ సర్కారు, అందునా స్వయంగా చంద్రబాబు స్పష్టం చేసిన నేపథ్యంలో ఎలా స్పందిస్తారోనని అటు అభిమానులు, ఇటు రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి పవన్ కల్యాణ్ ఏమనుకుంటున్నారో!

  • Loading...

More Telugu News