: తొలిరోజు నామినేషన్లు నిల్... ‘వరంగల్’ అభ్యర్థుల వేటలో ప్రధాన పార్టీలు


వరంగల్ లోక్ సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక కోసం నిన్న నోటిఫికేషన్ జారీ అయ్యింది. వచ్చే నెల 4 దాకా నామినేషన్ల దాఖలుకు గడువుంది. అయితే, తొలి రోజైన నిన్న ఈ ఎన్నికకు సంబంధించి ఒక్కటంటే ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఇందుకు కారణమేంటంటే, ప్రధాన పార్టీల్లో ఏ ఒక్కటి కూడా ఇప్పటిదాకా అభ్యర్థిని ఖరారు చేయలేకపోవడమే! వామపక్షాల తరఫున గాలి వినోద్ కుమార్ అభ్యర్థిత్వం ఖరారైనా ఆయన నిన్న నామినేషన్ దాఖలు చేయలేదు. అధికార పార్టీ టీఆర్ఎస్ తో పాటు విపక్షం కాంగ్రెస్ కు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈ స్థానంలో బలమైన అభ్యర్థులను నిలబెడితే తప్పించి విజయం సిద్ధించదని రెండు పార్టీలు భావిస్తున్నాయి. అభ్యర్థి ఖరారుపై వరుస భేటీలు నిర్వహిస్తున్నా ఫలితం ఉండటం లేదు. ఇక ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపేందుకు దాదాపుగా సిద్ధపడ్డ టీ టీడీపీ, బీజేపీలు కూడా ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో చివరి రోజు దాకా కూడా నామినేషన్ల దాఖలు కొనసాగే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News