: చాలా బాధతో ఆటను వదిలేశా: సెహ్వాగ్ ఆవేదన
తాను ఓ మ్యాచ్ ఆడుతూ క్రికెట్ నుంచి రిటైర్ మెంటు ప్రకటించేందుకు సెలక్టర్లు అవకాశం ఇవ్వలేదని వీరేంద్ర సెహ్వాగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రతి క్రికెటర్, తాను ఆడుతున్న చివరి మ్యాచ్ ఇదేనని ముందుగా నిర్ణయించుకోవాలని అనుకుంటాడని వీరూ అన్నాడు. తానూ చివరి మ్యాచ్ ఆడి క్రికెట్ కు గుడ్ బై చెప్పి ఉండేవాడినని, మిగతావారి మాదిరిగానే వీడ్కోలు సమయంలో అభిమానులను ఉద్దేశించి మాట్లాడి ఉండేవాడినని అన్నాడు. తన తలరాత మరోలా ఉందని మనస్తాపాన్ని వ్యక్తం చేసిన ఆయన, 2007లో జట్టు నుంచి స్థానం కోల్పోయినప్పుడు, ఇక ఆడకూడదని భావించానని, కానీ, సచిన్ ఒత్తిడి మేరకే అప్పట్లో రిటైర్ మెంటు ప్రకటించలేదని అన్నాడు. తనను ఇక ఎంపిక చేసే ఉద్దేశం లేదని సెలక్టర్లు చెప్పివుంటే, ఆ సిరీస్ నే తన ఆఖరి సిరీస్ అని చెప్పి ఆట నుంచి విరమణ ప్రకటించి ఉండేవాడినని అన్నాడు.