: సోము వీర్రాజుపై విరుచుకుపడ్డ టీడీపీ నేత రాజేంద్రప్రసాద్


బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై టీడీపీ ఎమ్మెల్సీ బాబూరాజేంద్రప్రసాద్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, సోము వీర్రాజు మిత్రధర్మాన్ని విస్మరించి మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి వేల కోట్ల నిధులు తెచ్చేసుకుంటోందని, అలాగే కేంద్రం పథకాల పేర్లు మార్చేసి రాష్ట్రంలో టీడీపీ వాడేసుకుంటోందనే ఆందోళనతో బీజేపీ నేత సోము వీర్రాజు చేస్తున్న వ్యాఖ్యలు ఆయన సొంతవా? లేక బీజేపీవా? అనేది ఆ పార్టీ స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సోము వీర్రాజు సొంత వ్యాఖ్యలైతే దీటుగా సమాధానమిస్తామని, అలాగే బీజేపీ వ్యాఖ్యలైనా సమాధానమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ముందు వీర్రాజు వ్యాఖ్యలపై ఆ పార్టీ స్పష్టతనివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన హద్దులు మీరి మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోలేమని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News