: నేపాల్ లో నూతన అధ్యాయం... దేశ తొలి మహిళా అధ్యక్షురాలిగా బిద్యా భండారి ఎన్నిక


నేపాల్ దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమయింది. దేశ అధ్యక్ష పీఠాన్ని తొలిసారి ఓ మహిళ అధిష్టించారు. గత నెలలో రాజ్యాంగాన్ని సవరించిన తర్వాత జరిగిన అధ్యక్ష ఎన్నికలో బిద్యా భండారి విజయం సాధించారు. ఇప్పటిదాకా ఆమె అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ వైస్ ఛైర్మన్ గా ఉన్నారు. అధ్యక్ష ఎన్నికలో నేపాలీ కాంగ్రెస్ అభ్యర్థి కుల్ బహదూర్ గురుంగ్ ను ఆమె ఓడించారు. మొత్తం 327 ఓట్లకు గాను బిద్యాకు 214 ఓట్లు వచ్చాయి. ఈ క్రమంలో దేశ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఆమె అవతరించారు.

  • Loading...

More Telugu News