: శభాష్ మోదీ...బృందా కారత్ వ్యంగ్యం!
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై సీపీఎం జాతీయ పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ నిప్పులు చెరిగారు. నిన్న కేరళ భవన్ లో చోటుచేసుకున్న సంఘటనలపై దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర పార్టీలన్నీ మండిపడుతున్నాయి. దీనిపై బృందా కారత్ సోషల్ మీడియాలో మండిపడ్డారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం నల్లధనంపై దాడులు చేయించకుండా, గోమాంసం ఎక్కడుందో వెతికిపట్టుకోండంటూ పోలీసులను ఆదేశిస్తోందని...'శభాష్ మోదీ ప్రభుత్వం' అని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కాగా, నిన్న కేరళ భవన్ లో గోమాంసం అమ్ముతున్నారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దీనిపై వివిధ పార్టీలు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే.