: సీఎం చంద్రబాబుకు కాలిఫోర్నియాలోని ఫ్రీ మోంట్ సిటీ మేయర్ అభినందన
ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన వేడుకలను అట్టహాసంగా నిర్వహించిన సీఎం చంద్రబాబు పలువురి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా కాలిఫోర్నియాలోని ఫ్రీ మోంట్ సిటీ మేయర్ బిల్ హ్యారిసన్ చంద్రబాబును అభినందించారు. శంకుస్థాపన వేడుకను ఘనంగా నిర్వహించారంటూ బాబుకు అభినందన పత్రాన్ని పంపారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి పల్లె రఘునాథరెడ్డికి ఆ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఇప్పటికే రాజధాని ప్రాంత రైతులు కూడా సీఎంను కలసి 'ఆరంభం అదిరింది సార్' అంటూ అభినందించిన విషయం తెలిసిందే.