: కోహ్లీ ప్రియురాలు ఇప్పట్లో పెళ్లిచేసుకోదట


బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మ టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రియుడు కోహ్లీతో పాటు తన తండ్రితో కలసి అనుష్క కనిపించింది. దీంతో, త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయనే వార్తలు షికారు చేశాయి. ఇప్పటికే ఇంటికోసం గాలిస్తున్నారని, ఇరు కుటుంబాలు కలసి త్వరలోనే వివాహ తేదీని నిర్ణయిస్తారని వార్తలు వెల్లువెత్తాయి. అయితే, ఈ వార్తలన్నీ కేవలం పుకార్లేనని, వాటిని నమ్మరాదని అనుష్క శర్మ ప్రతినిధి ప్రకటించాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో అనుష్క చాలా బిజీగా ఉందని... కెరీర్, జీవితం గురించి ఆమెకు పూర్తి స్పష్టత ఉందని తెలిపాడు. సమయం వచ్చినప్పుడు తన పెళ్లి గురించి అనుష్కే చెబుతుందని చెప్పాడు.

  • Loading...

More Telugu News