: మోగిన వరంగల్ ఉప ఎన్నికల నగారా... నోటిఫికేషన్ విడుదల
వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల నగారా మోగింది. తెలంగాణలో ప్రధాన పార్టీలన్నింటికీ ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా కలెక్టర్ కాసేపటి క్రితం నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఆ వివరాలు ఇవే... * అక్టోబర్ 28 నుంచి నామినేషన్ల స్వీకరణ * నవంబర్ 4 వరకు నామినేషన్లకు గడువు * నవంబర్ 5న నామినేషన్ల పరిశీలన * నవంబర్ 7 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు * నవంబర్ 21న పోలింగ్ * నవంబర్ 24న ఓట్ల లెక్కింపు ఉంటుంది.