: కలర్ ఫుల్ డ్రెస్ లో హర్భజన్, గీతా బస్రా... వేడుకలా సంగీత్
టీమిండియా స్పిన్నర్ హర్భజన్ రేపు ఓ ఇంటివాడు కానున్నాడు. తాను ప్రేమించిన గీతా బస్రాను అతడు రేపు పెద్దల సమక్షంలో వివాహం చేసుకోనున్నాడు. ఈ మేరకు నిన్న పెళ్లికి ముందు నిర్వహించే సంగీత్ కార్యక్రమంలో హర్భజన్ కలర్ ఫుల్ డ్రెస్ లో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. పంజాబ్ లోని జలంధర్ లో వేడుకగా జరిగిన సంగీత్ లో తెలుపు రంగు చొక్కా, ప్యాంటు, వాటిపై ఆరెంజ్ కలర్ ఆప్ కోటు, అదే కలర్ లో తలపాగాతో ముస్తాబైన హర్భజన్ కొత్త లుక్ లో అదిరిపోయాడు. అతడి పక్కన గ్రీన్ కలర్ చుడీదార్ లో కూర్చున్న గీతా బస్రా అతిథులను ఇట్టే ఆకట్టుకుంది.