: వరంగల్ లో బీజేపీ గెలిస్తే కేంద్ర మంత్రి పదవి లభిస్తుంది!: కిషన్ రెడ్డి ప్రకటన
వరంగల్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థి గెలిస్తే కేంద్ర మంత్రి పదవి లభిస్తుందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. వరంగల్ ఉప ఎన్నికలపై కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, బీజేపీలు ఉమ్మడిగానే ఈ బరిలోకి దిగనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అభ్యర్థి ఖరారు విషయంలో తమ రెండు పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్న ఆయన తమ మధ్య మంచి అవగాహన ఉందన్నారు. వరంగల్ ఉప ఎన్నికలు అధికార టీఆర్ఎస్ కు రెఫరెండం లాంటివేనని ఆయన పేర్కొన్నారు.