: వ్యాపార అనుకూల దేశాల లిస్టులో మెరుగైన భారత్, దిగజారిన పాక్: ప్రపంచ బ్యాంకు నివేదిక


ప్రపంచంలో వ్యాపార అనుకూల దేశాల జాబితాను ప్రపంచ బ్యాంకు కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. ఈ జాబితాలో మునుపటి కన్నా భారత్ స్థానం మెరుగైంది. గతంలో 142 వ స్థానంలో ఉన్న భారత్ తాజాగా 130వ స్థానానికి ఎగబాకింది. అంటే ఏడాది వ్యవధిలోనే భారత్ 12 స్ధానాలు పైకెగబాకినట్టైంది. అదే సమయంలో భారత్ దాయాదీ పాకిస్థాన్ మాత్రం తన ర్యాంకును దిగజార్చుకుంది. గతంలో ఈ జాబితాలో 128వ స్థానంలో ఉన్న పాక్, తాజా నివేదికలో 10 ర్యాంకులు దిగజారి 138వ స్థానానికి చేరుకుంది. ఇక గతంలో మాదిరే ఈ ఏడాది కూడా ఆ జాబితాలో సింగపూర్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. న్యూజిల్యాండ్, డెన్మార్క్ లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

  • Loading...

More Telugu News