: ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ బౌట్ వాయిదా


జాతీయ బాక్సర్ గా వైదొలగి ప్రొఫెషనల్ బాక్సర్ గా మారిన విజేందర్ సింగ్ రెండో బౌట్ వాయిదా పడింది. ఇంగ్లండ్ బాక్సర్ సన్నీ వైటింగ్ పై టెక్నికల్ విన్ సాధించి జోరుమీదున్న విజేందర్ రెండో బౌట్ లో బ్రిటన్ కే చెందిన డీన్ జిలెన్ తో అక్టోబర్ 30న తలపడాల్సి ఉంది. అయితే అది వాయిదా పడిందని విజేందర్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. నవంబర్ 7న డబ్లిన్ లో తన రెండో బౌట్ జరుగుతుందని విజేందర్ వెల్లడించాడు. కాగా, విజేందర్ లో అద్భుతమైన టెక్నిక్ ఉందని, పంచ్ పవర్ కంటే టెక్నిక్ తోనే విజేందర్ అద్భుతమైన భవిష్యత్ అందుకోగలడని నిపుణులు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News