: నిన్న భూకంపం, నేడు హిమపాతం!


జమ్మూకాశ్మీర్ వాసులను నిన్న భూకంపం ఉక్కిరి బిక్కిరి చేస్తే నేడు భారీ ఎత్తున కురిసిన మంచు ఆందోళనలోకి నెట్టింది. వరదలు, భూకంపం, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు జమ్మూకాశ్మీర్ ను మంచు కప్పేయడం మామూలే. శీతాకాలం ప్రారంభంలో ఓ మోస్తరుగా కురవాల్సిన మంచు పెద్దఎత్తున కురిసింది. దీంతో పూంఛ్ జిల్లా మంచు దుప్పటి కప్పుకున్నట్టు తయారైంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై మంచు భారీ ఎత్తున పేరుకుపోవడంతో వాహనాలు కదిలేందుకు మొరాయించాయి. కదిలిన వాహనాలు రోడ్లపై గ్రిప్ లేక జారిపోవడం ప్రారంభించాయి. దీంతో అధికారులు రహదారులపై మంచు తొలగించే కార్యక్రమం ప్రారంభించారు. పేరుకున్న మంచుతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

  • Loading...

More Telugu News