: అమెజాన్ బాటలో వాల్ మార్ట్...ఏవియేషన్ అధికారులకు వినతి
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ బాటలో అమెరికాకు చెందిన ఆన్ లైన్, రిటైల్ అమ్మకాల సంస్థ వాల్ మార్ట్ నడవనుంది. వినియోగదారులకు వస్తువులు చేరవేయడంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలని చూస్తోంది. దీంతో వినియోగదారులకు వస్తువులు చేర్చేందుకు డ్రోన్లు వినియోగించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా ఏవియేషన్ అధికారులకు వాల్ మార్ట్ ప్రతినిధులు దరఖాస్తు చేసుకున్నారు. డ్రోన్ పరిజ్ఞానం బయట వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. డ్రోన్ పరిజ్ఞానం వినియోగించుకునేందుకు అవకాశం ఇస్తే, ఉగ్రవాద చర్యలు సులువవుతాయని, ఇది ఆందోళన కలిగించే అంశమని ప్రపంచదేశాలు పేర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాల్ మార్ట్ కు అమెరికా అనుమతి ఇస్తుందా? అనే సందేహం కలుగుతోంది. కాగా, అమెజాన్ డ్రోన్ ల ద్వారా వస్తువులను వినియోగదారులకు చేరుస్తోంది. వాల్ మార్ట్ ఇప్పటికే డ్రోన్ ల ద్వారా తమ గిడ్డంగులకు పహారా ఏర్పాటు చేసుకున్నాయి. ప్రభుత్వం అనుమతిస్తే డ్రోన్ ల ద్వారా వస్తువులను వినియోగదారులకు చేర్చే పరీక్షలు నిర్వహించనున్నామని వాల్ మార్ట్ ప్రతినిధులు తెలిపారు.