: యజమానిని కాల్చిన కుక్క!
యజమానిని కుక్క ఎలా కాల్చింది, అనే అనుమానం వచ్చిందా? అయితే ఇది చదవండి. అమెరికాలోని ఇండియానాకు చెందిన ఇల్లీ కార్టర్ అనే మహిళ ఓ కుక్కను పెంచుకుంటోంది. దానికి 'ట్రిగ్గర్' అని పేరు పెట్టింది. గత వారాంతంలో అడవికి వేటకు వెళ్లిన కార్టర్ తన వెంట 'ట్రిగ్గర్'ను కూడా తీసుకుని వెళ్లింది. కాసేపయ్యాక బుల్లెట్లతో నింపిన తుపాకీని 'ట్రిగ్గర్' అన్ లాక్ చేసి, నేలమీద పెట్టి తన పనిలో మునిగిపోయింది. యజమాని చుట్టూ తిరుగుతున్న కుక్క, పొరపాటున తుపాకీ ట్రిగ్గర్ పై కాలు వేసింది. అంతే... తుపాకీ ఒక్కసారిగా పేలిపోయింది. బుల్లెట్ నేరుగా వెళ్లి యజమాని కాలిలోంచి చొచ్చుకుపోయింది. ఈ సంఘటన తర్వాత కార్టర్ మాట్లాడుతూ, ఇందులో 'ట్రిగ్గర్' తప్పేమీ లేదని సెలవిచ్చింది. జాగ్రత్తగా ఉండాల్సింది తానేనని లెంపలేసుకుంది!