: గుత్తేదార్లు సకాలంలో పనులు పూర్తి చేయకపోతే బ్లాక్ లిస్ట్ లో చేర్చుతా: మంత్రి కేటీఆర్


వాటర్ గ్రిడ్ పథకం పనులను సకాలంలో పూర్తి చేయని గుత్తేదార్లను (కాంట్రాక్టర్లను) బ్లాక్ లిస్ట్ లో ఉంచుతామని తెలంగాణ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. అధికారులతో మంగళవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇస్రో సాయంతో వాటర్ గ్రిడ్ పథకం పనులను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో పర్యవేక్షిస్తామని అన్నారు. 2018 జూన్ లోగా ప్రతి ఇంటికీ తాగునీటి సౌకర్యం లభిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకం పనులు వేగవంతంగా పూర్తి చేసే పనిలో తలమునకలై ఉంది. తాగునీటి సరఫరా కోసం అవసరమయ్యే ఏర్పాట్లు, పైప్ లైన్ల ఆధునికీకరణ, స్టోరేజ్ రిజర్వాయర్ల నిర్మాణం, ప్రస్తుతం ఉన్న వాటి వినియోగం, సామర్థ్యం మొదలైన అంశాలపై ప్రభుత్వం సమాచారం సేకరించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News