: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సిగరెట్ల స్మగ్లింగ్... అదుపులో నిందితులు
హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సిగరెట్ల స్మగ్లింగ్ జరుగుతుండగా అధికారులు పట్టుకున్నారు. దుబాయి నుంచి ఇక్కడికి అక్రమంగా తెచ్చిన సిగరెట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న సిగరెట్ల విలువ సుమారు రూ.51 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు. నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. సిగరెట్ల స్మగ్లింగ్ వెనుక ఎవరి హస్తం ఉందనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.