: అంగరంగ వైభవంగా సిరిమానోత్సవం...భారీగా తరలివచ్చిన భక్తులు


ఉత్తరాంధ్ర ప్రజలు సిరిమానోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ యాత్ర కొనసాగుతోంది. పైడితల్లి అమ్మవారి ఆలయం నుంచి కోట వరకు సిరిమాను ఊరేగింపు జరుగుతుంది. సిరిమాను రథాన్ని ప్రధాన పూజారి భాస్కరరావు అధిరోహించారు. ఈ సందర్భంగా మంత్రి మాణిక్యాలరావు సిరిమాను రథాన్ని లాగారు. కాగా, కోటపై నుంచి కేంద్ర మంత్రి అశోక గజపతిరాజు ఈ ఊరేగింపును తిలకిస్తున్నారు. మంత్రి మృణాళిని, జెడ్పీ చైర్ పర్సన్ స్వాతిరాణి, కలెక్టర్ నాయక్ తదితరులు కూడా ఈ ఊరేగింపును ఆసక్తిగా చూస్తున్నారు. రథం వద్దకు భక్తులు రాకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భక్తులు చొచ్చుకురాకుండా ఉండేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. సిరిమానోత్సవానికి రెండు లక్షలకు పైగా భక్తులు తరలివచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఊరేగింపు కార్యక్రమాన్ని భవనాలపై నుంచి భక్తులు వీక్షిస్తున్నారు. సుమారు రెండు వేల మంది పోలీసులు బందోబస్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News