: 'తప్పు మాది కాదు...కంప్యూటర్ ది' అంటున్న కవలలు


కవలలను గుర్తుపట్టడం కొన్నిసార్లు కష్టంగా మారుతుంది. ఈ విషయంలో ఇంట్లో వాళ్లు కూడా ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇప్పుడు కంప్యూటర్ కూడా ఈ విషయంలో తప్పులో కాలేసింది. ఇద్దరు కవలల్ని గుర్తుపట్టలేక, 'వారిద్దరు కాదు, ఒకరే' అని తేల్చిచెప్పింది. వివరాల్లోకి వెళ్తే... అమెరికాలోని జార్జియాకు చెందిన అలీసెన్, అలీషియా కవల సోదరీమణులు. వీరిద్దరూ డ్రైవింగ్ లైసెన్స్ కు దరఖాస్తు చేసుకున్నారు. లైసెన్స్ వస్తుందని ఎదురు చూస్తుండగా వారి దరఖాస్తు తిరస్కరిస్తున్నట్టు సమాధానం వచ్చింది. తిరస్కరణకు కారణమేంటని ఆరాతీయగా, వారు ఇద్దరు కాదని, ఒకరే రెండు దరఖాస్తులు చేశారని నిర్ధారించిన కంప్యూటర్ దరఖాస్తు తిరస్కరించిందని తెలిపారు. అయితే తాము ఒకేలా ఉంటాం కానీ, అచ్చుగుద్దినట్టు మాత్రం ఒకేలా ఉండమని, లోపం కంప్యూటర్ లోనే ఉందని వారిద్దరూ చెబుతున్నారు. అయితే వారిలో ఆ తేడాలను కంప్యూటర్ కూడా గుర్తించలేకపోవడం విశేషమే కదా?

  • Loading...

More Telugu News