: ఆ అందగత్తె ఏ క్షణమైనా పేలిపోవచ్చని బెంబేలెత్తిపోతున్నారు!


లియోనార్డీ డావిన్సీ కలల రాణి మోనాలిసాను పోలిన నవ్వు, బాలీవుడ్ నటి ప్రీతి జింటాను పోలిన ముఖవర్చస్సు గల యువతి టర్కీ భద్రతాదళాలను బెంబేలెత్తిస్తోంది. ఐఎస్ఐఎస్ లో చేరి శిక్షణ పొందిన సదరు యువతి ఆత్మాహుతి దళ సభ్యురాలు. దీంతో ఆమె ఎక్కడ? ఎప్పుడు? ఎలా తనను తాను పేల్చుకుంటుందో అని టర్కీ భద్రతాధికారులు భయపడిపోతున్నారు. ఆమెను 1995లో కజికిస్థాన్ లో జన్మించిన వాలెంతినా స్లొబొద్జానుక్ గా టర్కీ భద్రతాదళాలు భావిస్తున్నాయి. దీంతో ఆమె ఫోటోను టర్కీలోని వాడవాడలా అంటించారు. ఆమె ఆచూకీ తెలిస్తే చెప్పాలని కోరుతున్నారు. ఆమె ఎప్పుడు పేలిపోతుందో అని ఆందోళన చెందుతున్నారు. ఆమె నవ్వితే అచ్చం మోనాలిసా నవ్వులా ఉంటుందని వారు పేర్కొంటున్నారు. కాగా, ఐఎస్ఐఎస్ లో చేరేందుకు పాశ్చాత్య దేశాలకు చెందిన 550 మంది మహిళలు సిరియా వెళ్లారని పలు సర్వేలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News