: అగ్రరాజ్యానికి చైనా హెచ్చరిక
అగ్రరాజ్యం అమెరికాకు చైనా హెచ్చరిక జారీ చేసింది. అమెరికాకు చెందిన క్షిపణి విధ్వంసక యుద్ధనౌక అంతర్జాతీయ సముద్ర జలాల సరిహద్దు రేఖలను ఉల్లంఘించింది. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్పార్ట్ లీ దీవులకు 12 నాటికల్ మైళ్ల దూరంలో అమెరికా యుద్ధనౌక పహారా కాసింది. ఈ క్రమంలోనే యుద్ధనౌకకు చైనా హెచ్చరిక జారీ చేసింది. అంతేకాకుండా, అమెరికా అక్రమంగా తమ జలాల్లోకి ప్రవేశిస్తోందని చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పగడపు దిబ్బలు అత్యధికంగా ఉండే స్పార్ట్ లీ దీవులపై చైనా, తైవాన్, మలేషియా, బ్రూనై, వియత్నాం, ఫిలిప్పీన్స్ దేశాలు ఎప్పట్నుంచో కన్నేశాయి. ఈ క్రమంలో ఈ సముద్ర జలాల్లో ఆధిపత్య పోరు కొనసాగుతోంది.