: 300 దాటిన పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ భూకంప మృతులు
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో వచ్చిన భారీ భూకంప ఘటనలో మరణించిన వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 300 మందికి పైగా చనిపోయారని సమాచారం అందుతోంది. మృతుల సంఖ్య ఎక్కువగా పాకిస్థాన్ లోనే ఉంది. అలాగే, పాక్ లోనే 1,620 మంది క్షతగాత్రులయ్యారని నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ తెలిపింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న మధ్యాహ్నం 2 గంటల తరువాత సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 7.5గా నమోదైంది.